Breaking News

అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

Published on Wed, 06/14/2023 - 14:43

సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది. దీంతో ఖమ్మం సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు నిలిపివేశారు!.

కాగా ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న అమిత్‌ షా భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో ఉత్సాహం నింపాలని బీజేపీ భావించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, పార్టీ కమిటీల్లో మార్పులపై జరిగిన ప్రచారంతో కూడా కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. అమిత్‌ షా పర్యటన క్యాడర్‌లో నూతనోత్తేజాన్ని నింపే అవకాశం ఉందని ఊహించారు.

అయితే తాజాగా అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దవ్వడంతో కాషాయ పార్టీ శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక.. ఆయన రావడం లేదని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో హైదరాబాద్‌కు రాకున్నా.. కనీసం ఖమ్మం సభకైనా ఆయన నేరుగా హాజరు అయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు.

చదవండి: బీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)