Breaking News

మంట ధరల మంట! టమాటా, పచ్చిమిర్చి చోరీ

Published on Thu, 07/06/2023 - 04:12

డోర్నకల్‌: అధిక ధర పలు­కు­­తున్న టమాటా, పచ్చి­మిర్చి, చామ­గడ్డలపై దొంగల కళ్లు పడ్డాయి. మహబూ­బాబాద్‌ జిల్లా డోర్నకల్‌ కూరగా­యల మార్కెట్‌లోని పలు దుకా­ణా­ల్లో ఇటీవల కూరగా­యలు చోరీకి గురవుతు­న్నాయి. గాంధీసెంటర్‌­లోని కూరగాయల మార్కెట్‌లో రాత్రి వేళల్లో దుకా­­ణా­లకు తాత్కా­లిక నెట్‌ ఏర్పాటు చేస్తారు.

మార్కెట్‌కు నైట్‌వాచ్‌మన్‌ లేకపోవడం, ఇటీవల కూర­గాయల ధరలు పెరగడంతో రాత్రి వేళల్లో పలు దుకాణాల్లోని కూరగాయలు చోరీకి గురవుతున్నట్లు వ్యాపారులు గుర్తించారు. బుధవారం ఉదయం కూరగాయల వ్యాపారి లక్‌పతి తన దుకాణం తెరిచి చూడగా అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డతోపాటు ఇతర కూరగాయలు చోరీ అయినట్టు గుర్తించి లబోదిబోమన్నాడు.

కర్ణాటకలో టమాటా పంట చోరీ
యశవంతపుర: కాయగూరల ధరలు ఆకాశా­న్నంటుతున్నాయి. టమాటా ధరలు కిలో వంద రూపాయలను దాటాయి. దీంతో అందరి కళ్లు ఇప్పుడు ట­మాటాలపై పడ్డాయి. కర్ణాటకలో హసన్‌ జిల్లా బేలూరు తాలూకా గోణి సోమనహళ్లి గ్రామంలో టమాటా పంటను దొంగలు ఎత్తుకుపోయారు.

మంగళవారం రాత్రి తోటలోకి ప్రవేశించి, దాదాపు 60 సంచుల టమాటాలను కోసుకెళ్లారు. రైతు పొలంలోకి వెళ్లి చూడగా పంట మొత్తం మాయం కావడంతో హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన పంట ధర రూ.1.5 లక్షల వరకూ ఉంటుందని తెలిపాడు.  

టమాటా తోటకు సీసీ కెమెరా రక్షణ  
కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్‌ తాలూకా అక్కి ఆలూరు గ్రామంలో రైతు మల్లప్ప తన టమాటా తోటకు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. ధరలు పెరగటంతో దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని, అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పాడు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అటువైపు దొంగలు రాకుండా కాపలా కాస్తున్నట్లు తెలిపాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)