Breaking News

పదో వసంతంలోకి తెలంగాణ

Published on Fri, 06/02/2023 - 02:45

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం పదో వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా జూన్‌ 2 నుంచి మూడు వారాల పాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

అన్ని శాఖల పరిధిలోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఉదయం 7.30గంటలకే జాతీయ జెండా ఆవిష్కరించాలని.. తర్వాత సచివాలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని హెచ్‌ఓడీల అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయానికి హెచ్‌ఓడీల కార్యాలయాల నుంచి ఉద్యోగులను తరలించడానికి ప్రత్యేకంగా 278 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

వివిధ హెచ్‌వోడీల్లో పనిచేస్తున్న దాదాపు 13,510 మంది అధికారులు, ఉద్యోగులను ఈ వేడుకలలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శాఖలు, విభాగాల వారీగా ఉద్యోగులను తీసుకుని వచ్చే బస్సుల కోసం పార్కింగ్‌ స్థలంతోపాటు, వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులు లాన్‌లో ఎక్కడెక్కడ ఆసీనులు కావాలో తెలియచేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెచ్‌ఓడీల ఉద్యోగుల్లో కనీసం 60శాతం మంది సచివాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని ఆదేశాలు వెళ్లాయి. 

రోజుకో కార్యక్రమంతో.. 
ఇక దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో రోజు ఒక్కో రంగం చొప్పున 21 రోజుల పాటు ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 

జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో.. 
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు శుక్రవారం జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. నియోజకవర్గ, మండల స్థాయిల్లో సైతం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)