Breaking News

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈటలకు భద్రత పెంపు

Published on Fri, 06/30/2023 - 20:38

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై ప్లస్‌ భద్రత కల్పించింది. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికల్‌ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. ఈ మేరకు ఈటలకు భద్రత పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించనుంది.

కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్‌ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఈటల రాజేందర్‌ భద్రతపై మంత్రి కేటీఆర్‌ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్‌ చేసి ఎమ్మెల్యే భద్రతపై సీనియర్‌ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని సూచించారు.

ఈ క్రమంలో ఈటల రాజేందర్‌ నివాసానికి గురువారం డీసీసీ సందీప్‌ రావు చేరుకొని ఆయన భద్రత అంశంపై చర్చించారు. అనంతరం ఎమ్మెలయే భద్రతపై డీసీపీ సందీప్‌ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇచ్చారు. అయితే ఈటలకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వమే వై ప్లస్‌ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
చదవండి: కేటీఆర్‌కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్‌ ఇచ్చిన మంత్రి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)