Breaking News

అక్టోబర్‌లో అసెంబ్లీ షెడ్యూల్‌! 

Published on Tue, 06/20/2023 - 05:12

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం రెవెన్యూ శాఖ సమాయత్తం అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌ 5–15 తేదీల మధ్యలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని, అందుకు తగినట్టుగా కార్యాచరణ మొదలైందని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌వో), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల (ఏఆర్‌వో)తోపాటు క్షేత్రస్థాయిలో ఎంత మంది సిబ్బంది అవసరమనే దానిపై కసరత్తు జరుగుతోందని తెలిపాయి.

ఆర్‌వోలుగా డిప్యూటీ కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లతోపాటు ఈసారి జిల్లాల అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వివరించాయి. ఈ మేరకు 74 మంది డిప్యూటీ కలెక్టర్లు (ఇటీవలే పదోన్నతి పొందిన వారితో కలిపి), 14 మంది డిప్యూటీ కమిషనర్లు, 31 మంది అదనపు కలెక్టర్లను సిద్ధం చేయనున్నట్టు సమాచారం. ఇక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనికి వచ్చే అన్ని మండలాల తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. 

ఏఆర్‌వోల పర్యవేక్షణలో క్షేత్రస్థాయి ఏర్పాట్లు 
నామినేషన్ల ప్రక్రియతోపాటు పోలింగ్‌ సామాగ్రి సమకూర్చుకోవడం, పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు, ఈవీఎంలు, బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేయడం, పోలింగ్‌ స్టేషన్లలో కనీస సౌకర్యాల కల్పన వంటి ఏర్పాట్లన్నీ ఏఆర్‌వోల పర్యవేక్షణలో జరగనున్నాయి. ప్రస్తుతం ఓటర్ల జాబితా తయారీలో భాగంగా అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ (ఏఈఆర్‌వో) అధికారులుగా తహసీల్దార్లు పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఉండటంతో, ఆ తర్వాతే షెడ్యూల్‌ వస్తుందని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు మార్చి 5–15వ తేదీ మధ్య షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. 

2018లో ముందస్తు ఎన్నికలతో.. 
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటు 2019 ఏప్రిల్‌–మే నెలల్లో జరగాలి. కానీ రాష్ట్రంలో రాజకీయ కంగాళీ వాతావరణం ఏర్పడిందని.. తనను, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొంటూ.. సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

2018 సెప్టెంబర్‌ 6న ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేబినెట్‌లో తీర్మానించి.. అప్పటి గవర్నర్‌ను నరసింహన్‌కు అందజేయడం, ఆయన వెంటనే ఆమోదించడం, అదే రోజున 105 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కేసీఆర్‌ ప్రకటించడం చకచకా జరిగాయి.

అప్పుడు దేశంలో మరో నాలుగు రాష్ట్రాలకూ ఎన్నికల సమయం కావడంతో.. వాటితోపాటు తెలంగాణనూ కలిపి అక్టోబర్‌ 6న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 12న నోటిఫికేషన్‌ జారీకాగా డిసెంబర్‌ 7న పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మెజారిటీ సీట్లు గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

ఈసారి అదే సమయంలో..! 
ఈసారి కూడా ఆ నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. 2018లో జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా.. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 12, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరిగింది.

మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో నవంబర్‌ 28న, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో డిసెంబర్‌ 7న పోలింగ్‌ నిర్వహించారు. ఈసారి కూడా ఐదు రాష్ట్రాల పోలింగ్‌ ప్రక్రియ డిసెంబర్‌ 5–9 తేదీల మధ్య ముగిసే అవకాశాలు ఉన్నాయని.. ఇందుకు అనుగుణంగా అక్టోబర్‌ రెండో వారంలోనే షెడ్యూల్‌ రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి.   

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)