Breaking News

దశాబ్ది వేడుకల వేళనైనా.. కనికరించండి

Published on Thu, 06/22/2023 - 03:03

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల వేళనైనా తమపై కనికరించి బదిలీలకు మోక్షం కలిగించాలని 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల స్పౌజ్‌ బదిలీలు జరిగినా, మిగతా జిల్లాలకు సంబంధించి పెండింగ్‌లో పెట్టారు. 18 నెలలు కావస్తున్నా అతీగతీ లేకపోవడంతో దశాబ్ది ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలోనైనా ఉపాధ్యాయ స్పౌజ్‌ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

2022 జనవరి నుంచి ఇప్పటి వరకు బదిలీల కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మంత్రులను కలుస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అదే సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు గోడు వివరిస్తున్నప్పటికీ 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు మాత్రం మార్గం సుగమం కావడం లేదు. 

జిల్లాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ... 
దాదాపు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరపడానికి అవసరమైన ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో 21 మంది ఎస్జీటీలు స్పౌజ్‌ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ జిల్లాలో సుమారు 300 ఎస్‌జీటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో కేవలం 5గురు మాత్రమ స్పౌజ్‌ బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, కానీ అక్కడ వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.

స్పౌజ్‌ బదిలీలు జరగని మిగతా జిల్లాలైన వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. మిగిలిపోయిన 13 జిల్లాల్లోని స్పౌజ్‌ ఖాళీలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఎందుకు ఆసక్తి చూపడం లేదో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చెందుతున్నారు.  

భర్త ఓ చోట... పిల్లలు మరోచోట 
స్పౌజ్‌ బదిలీలు జరగకపోవడంతో మహిళా ఉపాధ్యాయుల బాధలు వర్ణణాతీతం. భర్త ఒకచోట, భార్య మరో చోట.. చదువుల కోసం పిల్లలు హైదరాబాద్‌లోనో.. ఉండాల్సి రావడంతో ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొందని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన 18 నెలలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారు కనీసం దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా తీపి కబురు అందుతుందని ఆశిస్తున్నారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)