Breaking News

పల్లెవెలుగు బస్సుల్లో టీ9 టికెట్‌ 

Published on Sat, 06/17/2023 - 03:23

సాక్షి, హైదరాబాద్‌: పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా టీ9 పేరుతో కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణ చార్జీ భారాన్ని కొంతమేర తగ్గించే ఈ టికెట్లను ఆదివారం నుంచి అమలులోకి రానుంది. పల్లె వెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివి ప్రయాణించేవారు రూ.100 చెల్లించి ఈ టీ9 టికెట్‌ కొంటే, అప్‌ అండ్‌ డౌన్‌కు అదే వర్తిస్తుంది.

విడిగా మరో టికెట్‌ కొనాల్సిన అవసరం ఉండదు. 60 కి.మీ. పరిధి దాటితే మాత్రం ఇది వర్తించదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ వెసులుబాటు ఉంటుంది. పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివికి రెండువైపులా (అప్‌ అండ్‌ డౌన్‌) ప్రయాణానికి దాదాపు రూ.120 టికెట్‌ చార్జి అవుతుంది.

ఒకేసారి టీ9 టికెట్‌ కొంటే రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.20 ఆదా అవుతుంది. ఆ ప్రయాణ మార్గంలో టోల్‌గేట్‌ ఉంటే టికెట్‌పై రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టీ9 టికెట్‌తో టోల్‌ చార్జి భారం కూడా ఉండదు. మొత్తంగా రూ.40 ఆదా అయినట్టవుతుంది. 

ఆటోల దూకుడుకు కళ్లెం 
చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు విపరీతంగా పెరిగిపోయి, బస్సు ప్రయాణికులను ఎగరేసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ టికెట్‌ రూపంలో కనీసం రూ.20 ఆదాతో ఆటో తాకిడి నుంచి బయటపడేందుకు యత్నించనుంది. వెళ్లేప్పుడు ఓ పల్లెవెలుగు బస్సులో ఈ టీ9 టికెట్‌ కొంటే, వచ్చేప్పుడు మరో పల్లెవెలుగు బస్సులో దాన్ని విని యోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

అయితే, దాన్ని ఆ మార్గంలో ఒకే ప్రయాణానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. మహిళలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు వయసు ధ్రువీకరణ పత్రం చూపి ఈ వెసులుబాటు పొందాల్సి ఉంటుంది. సాయంత్రం 6తో ఈ అవకాశం ముగియనున్నందున కండక్టర్లు సాయంత్రం 4 వరకు మాత్ర మే ఆ టికెట్లు జారీ చేస్తారు.

కాగా, పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పిం చేలా ఈ కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో ఈ టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టికెట్‌కు సంబంధించిన సమాచారం కావాలనుకునేవారు ఆర్టీసీ కాల్‌సెంటర్‌ (ఫోన్‌ నెంబర్లు 040–6944 0000, 040–23450033)ను సంప్రదించొచ్చని సజ్జనార్‌ తెలిపారు.   



 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు