Breaking News

రెండోరోజూ ఐటీ సోదాలు

Published on Fri, 06/16/2023 - 03:56

సాక్షి, హైదరాబాద్‌/దిల్‌సుఖ్‌నగర్‌/ముషీరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మొదలైన ఐటీ సోదాలు గురువారం రెండోరోజూ కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్‌ 36లో ఉన్న నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటితోపాటు కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్‌ కాలనీలో ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. తనిఖీల్లో  వారి కంపెనీలకు చెందిన  బ్యాంకు ఖాతాలు, లాకర్లు, బ్యాలెన్స్‌ షీట్లను అధికారులు సేకరించారు. ఒక్కో కంపెనీకి చెందిన ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించారు. 

ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి... 
పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసిన రియల్‌ ఎస్టేట్, మైనింగ్‌ సహా ఇతర వ్యాపారాలపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్‌ సిండికేట్‌ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.

హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు తెలిసింది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను సైతం అధికారులు తెరిపించారు. పన్నుల ఎగవేతపై ఆరా తీశారు.

సోదాలయ్యాక వారి సంగతి చూస్తా: ఎమ్మెల్యే మర్రి 
ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేయగా తన ఇంటి నుంచి బయటకు వచ్ఛి న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఐటీ అధికారులు వారి పని చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోవైపు తమ సిబ్బందిని ఐటీ అధికారులు బెదిరించారని... కొందరిపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

అధికారులకు చేయి చేసుకొనే హక్కు లేదని... అలా జరిగితే తాము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు. సోదాలు ముగిశాక వారి సంగతి చూస్తామన్నారు. కాగా, ముషీరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేత కొండపల్లి మాధవ్‌ నివాసంపై బుధవారం ఉదయం 5 గంటలకు మొదలైన ఐటీ దాడులు రాత్రి 12 గంటలకు ముగిశాయి. తన ఇంటిపై ఐటీ దాడులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని మాధవ్‌ ఆరోపించారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)