Breaking News

సెల్‌ఫోన్‌ నిజామాబాద్‌లో పోయింది.. దుబాయ్‌లో దొరికింది!

Published on Sat, 06/10/2023 - 16:37

మన జీవితంలో భాగంగా మారి పోయిన స్మార్ట్‌ ఫోన్‌ పోగొట్టుకుంటే మనం మొత్తం కోల్పోయినట్లే ఫీలవుతాం. అంతలా మనతో పాటే కలిసిపోయింది స్మార్ట్‌ ఫోన్‌. అటువంటి ఫోన్‌ను పోగొట్టుకుంటే మనశ్శాంతి కూడా ఉండదు.. ఫోన్‌ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. వందలాది కాంటాక్ట్‌ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. ముఖ్యమైన డేటా అంతా కూడా అందులోనే ఉండటంతో ప్రపంచమే ఆగిపోయినట్లు ఉంటుంది. అయితే ఇలా ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా తిరిగి దాన్ని సంపాదించుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

వివరాల్లోకి వెళితే..  నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో బాన్సువాడకు చెందిన వ్యక్తి తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు.  ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఫోన్‌ ఎక్కడిపోయిందో అనే విషయాన్ని గుర్తుకుతెచ్చుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో పోయిందనే విషయాన్ని గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ ద్వారా ఆ ఫోన్‌ దుబాయ్‌లో ఉందని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్‌లో సెల్‌ఫోన్‌ పోతే అది దుబాయ్‌లో ఉందని కనుక్కోవడం వెనుక నూతన టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. అంతే ఆ సెల్‌ఫోన్‌ను దుబాయ్‌ నుంచి కొరియర్‌ ద్వారా తెప్పించారు నిజామాబాద్‌ జిల్లా పోలీసులు. ఆ తర్వాత సదరు బాధితునికి డీఎస్సీ జైపాల్‌రెడ్డి.. ఆ సెల్‌ఫోన్‌ను అప్పగించారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)