Breaking News

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్‌ జగదీష్ హఠాన్మరణం

Published on Sun, 06/11/2023 - 13:32

సాక్షి, వరంగల్‌: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని తన నివాసంలో జగదీష్ గుండెపోటుకు గురికాగా, వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించేలోపే జగదీష్ తుదిశ్వాస విడిచారు. జగదీష్.. ఏప్రిల్ 1న తొలిసారి గుండెపొటుకు గురికాగా భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల అప్పుడు ప్రాణాపాయం తప్పినా సరిగ్గా 51 రోజుల వ్యవధిలోనే మరోసారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

జగదీష్ ఇకలేరనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం ములుగు జిల్లా మల్లంపల్లికి తరలించారు. మల్లంపల్లికి చెందిన జగదీష్ ఏటూరునాగారం నుంచి జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఇటీవల ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను సైతం పార్టీ అధినేత కేసిఆర్ జగదీష్‌కు అప్పగించారు.

నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో జగదీష్ చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధిగా పార్టీ అధ్యక్షులుగా ములుగు జిల్లాలో జగదీష్ చేసిన సేవలు స్మరిస్తూ అభిమానులు పార్టీ నేతలు నివాళులర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జగదీష్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.
చదవండి: బిగ్‌ ట్విస్ట్‌.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్‌..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)