Breaking News

తెలంగాణ: సమీపిస్తున్న ఎన్నికలు.. కీలక పోస్టులకు సీఈసీ నియామకాలు

Published on Wed, 06/28/2023 - 19:33

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న రెండు ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీ రవికిరణ్ స్థానంలో డీఎస్‌ లోకేష్ కుమార్‌ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా, మరో సీనియర్ IAS అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌ను జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.  ఈ మేరకు తెలంగాణ సీఎస్‌కు బుధవారం లేఖ రాసింది.

కాగా, లోకేష్‌ కుమార్‌ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్‌ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ఎ‍న్నికల అధికారిగా ఐఏఎస్‌ వికాస్ రాజ్ కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ కలాహలం కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు, నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల సన్నద్దతపై వారం రోజుల క్రితం కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు రాష్ట్రంలో పర్యటించి సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)