Breaking News

కొన్ని కేటగిరీలకు ఉమ్మడి పరీక్షలు 

Published on Mon, 06/19/2023 - 05:15

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టింది. పరీక్షలను సులభతరంగా నిర్వహించే క్రమంలో అభ్యర్థులకు వెసులుబాటు కల్పించింది.

ఆగస్టు 1 నుంచి 22వ వరకు పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల వారీగా తేదీలను ఖరారు చేస్తూ రూపొందించిన వ్యూహాత్మక టైమ్‌టేబుల్‌ను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఉంచింది. విద్యార్హతలు సమానమైన కేటగిరీ కొలువులకు పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. తద్వారా అభ్యర్థులు ఒక పేపర్‌లో అర్హత సాధిస్తే సంబంధిత పోస్టులకు అర్హత సాధించినట్లే.
 
పేపర్‌ వన్, టూల్లోనే ఉమ్మడిగా.. 
టీఆర్‌ఈఐఆర్‌బీ రూపొందించిన పరీక్షల షెడ్యూల్‌ కాస్త ఒత్తిడి కలిగించే వి«ధంగా కనిపిస్తున్నప్పటికీ ఉమ్మడి పరీక్షలతో అభ్యర్థులకు భారీ ఊరట లభించనుంది. సులభతర పరీక్షా విధానం ఉండటంతో రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్‌టేబుల్‌ ఉందని అధికారులు చెబుతున్నారు. మొదటి సెషన్‌ కింద ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యా హ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, మూడో సెషన్‌ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

పలు పోస్టులకు పేపర్‌–1, పేపర్‌–2లను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. పీజీ అర్హతతో ఉన్న పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌), డిగ్రీ లెక్చరర్‌ (డీఎల్‌) కేటగిరీ కొలువులకు పేపర్‌–1 పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తున్నా రు. అంటే ఒక అభ్యర్థి ఈ మూడు పరీక్షలకు దరఖాస్తు చేసి.. కేవలం ఒకసారి పేపర్‌–1 పరీక్ష రాసి అర్హత సాధిస్తే మూడింటికీ పేపర్‌–1లో అర్హత సాధించినట్టేనన్నమాట. పీజీటీ, జేఎల్‌ కొలువుల పేపర్‌–2 పరీక్షలను కూడా ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు.

ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన పెడగాగి (విద్యాబోధన శాస్త్రం) ఒకే రకంగా ఉండటంతో ఈ రెండు కేటగిరీలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇక పేపర్‌–3 పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు గురుకుల బోర్డు స్పష్టత ఇచ్చింది. పరీక్ష తేదీలు ఎక్కడా క్లాష్‌ కాకుండా పక్కా షెడ్యూల్‌ తయారు చేసినట్లు వివరించారు. పరీక్షలన్నీ సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌) పద్ధతిలో నిర్వహించడం ద్వారా ఫలితాలను కేవలం నెలరోజుల్లో విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)