Breaking News

ముగిసిన సోదాలు.. బీఆర్‌ఎస్‌ ఎంపీకి నోటీసులిచ్చిన ఐటీ అధికారులు

Published on Thu, 06/15/2023 - 15:03

సాక్షి, మెదక్‌: తెలంగాణ బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్‌గా కలకలం సృష్టించాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోవైపు.. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 

ఇక, ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. ఎంపీ ప్రభాకర్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. మరోవైపు, పైళ్ల శేఖర్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, కంపెనీల లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఆరా తీస్తున్నారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్‌ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్‌ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి  ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. 

ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్‌ చేశారు. కాగా, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్‌ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ​కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. 

ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో తుపాను రాబోతోంది.. రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)