Breaking News

హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

Published on Sun, 06/04/2023 - 17:37

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడగా  మరికొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.

మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్‌, రాయదుర్గం, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, సురారం, గాజులరామారం, కూకట్‌పల్లి, చింతల్‌, బాలానగర్‌, నార్సింగి, కోకాపేట్‌, కొండాపూర్‌, కొంపల్లి, అల్వాల్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, లింగంపల్లి, నిజాంపేట, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, రామచంద్రపురం, అమీన్‌పూర్‌ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుండగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నగరంలో వాన దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. సంగారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట, వికారాబాద్‌ జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.

మరోవైపు తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సూచనలున్నాయని పేర్కొంది.  ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానపడే అవకాశాలున్నాయని, మిగతా చోట్ల అక్కడక్కడ జల్లులు కురుస్తాయని తెలిపింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)