Breaking News

ఆగస్టులో గురుకుల కొలువుల పరీక్షలు 

Published on Fri, 06/16/2023 - 05:30

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) కీలక ప్రకటన చేసింది. ఆగస్టులో అర్హత పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యన అర్హత పరీక్షలను నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన తేదీలను రెండ్రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు గురువారం టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. 9 కేటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ ప్రకటనలు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ నెలాఖరులో పూర్తి కానుంది. 9,210 కొలువులకు 2,63.045 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 29 మంది పోటీ పడుతున్నట్లు అంచనా. 

సీబీటీ పద్ధతిలో పరీక్షలు: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించే అర్హత పరీక్షలన్నీ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) మోడ్‌లో  నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు స్పష్టం చేసింది. తొలుత ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ... టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు సీబీటీ పద్ధతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సీబీటీ పరీక్షల సామర్థ్యం కూడా అభ్యర్థుల సంఖ్యకు తగినట్లుగా ఉండడంతో టీఆర్‌ఈఐఆర్‌బీ ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం