Breaking News

రాష్ట్రంలో టీసీఎల్‌ యూనిట్‌ ఏర్పాటు

Published on Thu, 06/29/2023 - 02:55

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థ టీసీఎల్‌.. తెలంగాణలో కంపెనీని ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రాష్ట్రానికి చెందిన రిసోజెట్‌ సంస్థతో కలసి కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్‌ గూడ్స్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ మేరకు బుధవారం పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో రిసోజెట్‌తో టీసీఎల్‌ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. టీసీఎల్‌ ఎల్రక్టానిక్స్‌ తన ప్రధాన కేంద్రం అయిన చైనాలోని హెఫెయి నగరం తర్వాత ఇతర దేశాల్లో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్‌ ఇదే కావడం గమనార్హం.

ఈ కంపెనీలో తొలుత వాషింగ్‌ మెషిన్లను తయారు చేస్తారు. అనంతరం రిఫ్రిజిరేటర్లు, డిష్‌ వాషర్ల వంటి ఇతర ఉపకరణాలనుకూడా తయారు చేస్తారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ’ఈ– సిటీ’లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌ కోసం టీసీఎల్‌ రూ.225 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ యూనిట్‌తో తొలిదశలోనే సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెపుతున్నారు. రాష్ట్రంలో టీసీఎల్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టడాన్ని మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు.

ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ రంగానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఇక్కడ హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం హైదరాబాద్‌ను షెన్జెన్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను, టీసీ ఎల్‌ సంస్థ చైర్‌పర్సన్‌ జువాన్‌ డూకి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరించారు.

తెలంగాణలో ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీకి ఉన్న అనుకూల పరిస్థితులు, మౌలిక వసతులు, తమ ప్రభుత్వ విధానాలను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని కేటీఆర్‌ ఆమెను ఆహా్వనించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కంపెనీ రెజల్యూట్‌ గ్రూప్‌ చైర్మన్‌ రమీందర్‌ సింగ్‌ సొయిన్, రాష్ట్ర ఎల్రక్టానిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సుజాయ్‌ కారంపురి తదితరులు పాల్గొన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)