Breaking News

కాళ్లు మొక్కుతాం.. మా డబ్బులు మాకివ్వండి

Published on Thu, 06/15/2023 - 09:22

సాక్షి, నిజామాబాద్‌ (డిచ్‌పల్లి): ‘ఏదో పని దొరుకుతుందని ఆశ పడి అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాం. కాళ్లు మొక్కుతాం.. కనికరించి మా డబ్బులు మాకివ్వండి సారూ’ అంటూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ డి.రవీందర్‌గుప్తా కాళ్లపై పడి బాధితులు వేడుకున్నారు. వీసీ రవీందర్‌ బుధవారం క్యాంపస్‌కు వచ్చినట్లు తెలియడంతో భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన 15 మంది బాధితులు మెయిన్‌ క్యాంపస్‌కు చేరుకున్నారు.

ఉద్యోగాల పేరుతో డెయిలీవేజ్‌ కింద తమను పనిలోకి చేర్చుకున్నారని, ఇందుకోసం వీసీ రవీందర్‌ ఒక్కొక్కరి వద్ద రూ. 40 వేల నుంచి రూ. 50వేలు తీసుకున్నారని బాధితులు సుభద్ర, ప్రశాంత్, ప్రభాకర్‌గౌడ్, రాహుల్‌ తదితరులు తెలిపారు. మూడు నెలలు పనిచేసిన తర్వాత ప్రభుత్వం, ఈసీ ఆమోదం లేదని తమను పనిలోకి రావద్దని చెప్పారని బాధితులు వివరించారు.

పనిచేసిన కాలానికి కూడా ఒక్కరూపాయి జీతం ఇవ్వలేదని, తాము ఇచ్చిన డబ్బులన్నా తిరిగి ఇవ్వాలని వీసీని ఘోరావ్‌ చేశారు. వీరికి విద్యార్థులు అండగా నిలిచారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు చివరకు వీసీ కాళ్లపై పడి తమ డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో వీసీ.. బాధితులందరూ పేర్లు, అమౌంట్, ఫోన్‌ నంబర్లు రాసి ఇవ్వాలని, రెండు రోజుల్లో ఎవరి డబ్బు లు వారికి ఫోన్‌పే చేస్తానని హామీ ఇచ్చారు.
చదవండి: బీజేపీ అధ్యక్షుడు మార్పు.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఇన్‌చార్జి

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)