Breaking News

34 ఏళ్ల సర్వీసులో ఇంత ప్రగతి చూడలేదు

Published on Sun, 06/11/2023 - 02:31

సాక్షి, హైదరాబాద్‌: గత 9 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని, దేశంలో మరే రాష్ట్రం సాధించని అభివృద్ధిని తెలంగాణ సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్‌ ప్రణాళికలేనని  చెప్పారు. తన 34 ఏళ్ల సర్వీసులో రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి గతంలో చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో నిర్వ హించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవంలో సీఎస్‌ మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో 2014కి ముందు వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదని, వాటర్‌ ట్యాంకర్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వచ్చేదన్నారు. అప్పట్లో వేసవి కాలం వచ్చిందంటే జిల్లా కలెక్టర్లతో సహా రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్లు రూపొందించుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు.

అన్ని రంగాల్లో రాష్ట్రం రికార్డు 
నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్ర మలు, విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, సుపరి పాలన, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో రాష్ట్రం రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందన్నారు. హరితహారంలో నాటిన 90 శాతం మొక్కలు మనుగడ సాధించడం ఒక అద్భుతమని శాంతికుమారి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రసూతి మరణాల్లో గణనీయమైన తగ్గుదల సాధించామని, ఇమ్యూనైజేషన్‌ పెరిగిందని, వైద్యారోగ్య రంగంలో అద్భుతాలు చవిచూశామని ఆమె వివరించారు. కార్య క్రమంలో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు తమ శాఖల విజయాలను పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. డీజీపీ అంజనీకుమార్, పీసీసీ ఎఫ్‌ డోబ్రియాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)