Breaking News

బీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌! ముగిసిన ఐటీ సోదాలు

Published on Sun, 06/18/2023 - 04:02

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు రోజులుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో అలజడి సృష్టించిన ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రిజనార్ధన్‌ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారితో స్థిరాస్థి వ్యాపార సంబంధాలున్నాయన్న ఆరోపణలపై మరికొన్ని కంపెనీల్లోనూ ఈ సోదాలు జరిగా యి.

పదుల సంఖ్యలో ఐటీ అధికారులు.. 60కిపైగా ప్రాంతాల్లో పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతలు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై ఆరా తీసిన అధికారులు, సదరు నాయకులకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత వివరాలు, ఆధారాలతో ఫతేమైదాన్‌లోని ఐటీ ఆఫీస్‌లో మంగళవారం హాజరుకావాలని సూచించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో కొత్తపేట గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులు, జూబ్లీహిల్స్‌లోని మర్రి జనార్ధన్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులో సోదాల సందర్భంగా వారి అనుచరుల ఆందోళనలు కొంత ఉద్రిక్తతకు దారితీశాయి.

ఇద్దరు ఎమ్మెల్యేలు బ్యాంకు ఖాతాలతోపాటు బ్యాంకు లాకర్లను సైతం తెరిపించి సోదాలు చేపట్టారు. శుక్రవారం లైఫ్‌స్టైల్‌ సంస్థ డైరెక్టర్‌ ఇల్లు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగాయి. కాగా, ఐటీ సోదాలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పు డు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని తెలిపారు. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)