Breaking News

మన స్మారకం.. ఘన నిర్మాణం 

Published on Thu, 06/22/2023 - 03:40

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణను సాకారం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారకార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం గురువారం ప్రారంభం కానుంది. హుస్సేన్‌సాగర్‌ తీరంలో గతంలో ఉన్న లుంబినీపార్కు స్థలంలో సచివాలయ భవనానికి ఎదురుగా నిర్మించిన ఈ స్మారకాన్ని గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

అతుకుల్లేని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో నిర్మించిన ఈ కట్టడం నగరంలో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. అద్దంతో నిర్మించినట్టుండే ఈ కట్టడం ప్రపంచంలోనే నాలుగోది కావటం విశేషం. జర్మనీ తయారీ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను దుబాయ్‌లో నిపుణులు ప్రీఫ్యాబ్రికేటెడ్‌ చేసి నగరానికి తరలించి అతికించి రూపొందించారు.

కేవలం జర్మనీ తయారీ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌కే దాదాపు రూ.50కోట్లు వ్యయం చేశారు. రూ.177 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం 26,800చ.మీ.ల విస్తీర్ణంలో రూపొందింది. 45 మీటర్ల ఎత్తుతో దీపం జ్వలిస్తున్నట్టు ప్రమిద ఆకారంలో నిర్మించిన ఈ భవనం ఆకట్టుకుంటోంది. 

క్లౌడ్‌ గేట్‌: ఇది అమెరికాలోని ప్రధాన నగరాల్లో  ఒకటైన చికాగోలో ఉంది. అక్కడి సముద్రం ఒడ్డున  భారీ ఆకాశహర్మ్యాల ప్రతిబింబాలతో అత్యంత సుందరంగా ఉంటుంది. ఎత్తయిన భవనాలు మేఘాలను తాకేలా ఉంటాయని ‘క్లౌడ్‌ గేట్‌’పేరుతో దీన్ని  మిలీనియం పార్కులో ఏర్పాటు చేశారు. భారత్‌లో పుట్టి బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌గా స్ధిరపడ్డ అనీశ్‌కపూర్‌ దీన్ని డిజైన్‌ చేశారు.

లిక్విడ్‌ మెర్క్యురీ ఇతి వృత్తంగా రూపకల్పన చేసినప్పటికీ అది చిక్కుడు గింజ ఆకారంలో ఉండటంతో ‘ది బీన్‌’గా ఖ్యాతి పొందింది. ఇందుకు 168 భారీ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ప్లేట్లను వినియోగించారు. ఇది 66 అడుగుల పొడవు 33 అడుగుల ఎత్తు ఉంది. 2004లో నిర్మాణం మొదలై 2006లో ప్రారంభమైంది.

ప్రపంచంలో ఈ తరహా నిర్మాణాలివి.. 
బిగ్‌ ఆయిల్‌ బబూల్‌: ఇది చైనాలోని కార్మే నగరంలో కొలువు దీరింది. ఆధునిక చైనా రూపకల్పనలో  అక్కడి ప్రభుత్వం 1955 ప్రాంతంలో కార్మేలో చమురు బావుల తవ్వకం చేపట్టింది. తొలి బావి 1956లోఅందు బాటులోకి వచ్చింది. ఆ నగరం చమురు కేంద్రం అన్న భావన వచ్చేలా ‘బిగ్‌ ఆయిల్‌ బబూల్‌’పేరుతో స్థానికంగా దీన్ని నిర్మించారు. చికాగోలోని క్లౌడ్‌ గేట్‌కు నకలుగా ఉన్నా.. చైనా మాత్రం కాదంటోంది. దాదాపు 250 స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ షీట్లతో దీన్ని 2013లో రూపొందించారు. కానీ ఇది చికాగో నిర్మాణం తరహాలో లేదన్న విమర్శలు మాత్రం వినిపించాయి.

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియం: భారీ స్టెయిన్‌లెస్‌  స్టీల్‌ షీట్లతో నిర్మించిన మూడో కట్టడం ఇది. ఆధునిక నిర్మాణాలకు కేంద్రంగా దుబాయ్‌ నిలుస్తోందని  చెప్పే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం నిర్మించింది. నాలుగు అంతస్తులుగా ఉండేలా 225 అడుగుల  ఎత్తు, 17600 చదరపు మీటర్ల వైశాల్యంతో దీన్ని నిర్మించారు.

ఇందులో ఎగ్జిబిషన్లు, ఇతర ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తారు. ఆధునిక దుబాయ్‌ లక్ష్యాన్ని అరబ్బీ  అక్షరాల్లో తీర్చిదిద్దారు. మనం వందల ఏళ్లు బతకలేకపోయినా, మన ఆధునిక ఆవిష్కరణలు వందల ఏళ్లు మనుగడ సాగిస్తాయన్న ప్రారంభంతో ఆ పద్యం ఉంటుంది. దీన్ని 2016లోనే నిర్మించినా, 2022లో పూర్తి చేసి అధికారికంగా ప్రారంభించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)