Breaking News

గిరిజనులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌.. ఆ కేసులు రద్దు!

Published on Fri, 06/30/2023 - 15:34

సాక్షి, కొమురం భీం అసిఫాబాద్‌: అసిఫాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలను  సీఎం‌ విడుదల చేశారు. లక్షన్నర మంది గిరిజనులకు 4 లక్షల 6 వేల ఎకరాల పట్టాలు పంపిణీ చేశారు. పోడు భూములకు రైతుబంధు నిధులు విడుదల చేశారు. 

కేసీఆర్‌ మాట్లాడుతూ.. గిరిజన మహిళల పేరు మీదే పోడు భూముల పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. పోడు భూములపై ఉన్న గతంలోని కేసులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చిన తరువాత కేసులు ఉండటం సరికాదని అన్నారు. ఈ మేరకు వేదిక మీదే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు కోసం దాదాపు రూ. 24 కోట్లు నిధుల కేటాయించినట్లు చెప్పారు.

గిరిజన రైతుల పల్లెలకు త్రీ-ఫేజ్‌ కరెంట్‌ అందించాలని పేర్కొన్నారు. దేశంలో 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణనే అని పునరుద్ఘాటించారు. అసిఫాబాద్‌లో మెడికల్‌ కాలేజీ కలలో కూడా ఊహించి ఉండరని అన్నారు.

అంతకముందు మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ ముందుగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌కు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. అక్కడ రిబ్బన్‌ కట్‌ చేసి పోలీస్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. 
చదవండి: వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి: ఈటల కౌంటర్‌!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)