Breaking News

ఆరోగ్యశ్రీలో కేన్సర్‌కు వైద్య సేవలందించాలి: హరీష్‌ రావు ఆదేశం

Published on Wed, 07/05/2023 - 10:56

సాక్షి, శేరిలింగంపల్లి (హైదరాబాద్‌): ఆరోగ్యశ్రీలో పేదలకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కేన్సర్‌కు వైద్య సేవలు అందించాలని, వాటి బిల్లులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన ఎథోస్‌ రేడియోథెరపీ సిస్టమ్‌ను ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...ఎథోస్‌ రేడియోథెరపీతో ఈ ప్రాంత ప్రజలకు అధునాత టెక్నాలజీతో కూడా వైద్య సేవలు అందడం సంతోషం అన్నారు. కేన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ విభాగంలో 300 బెడ్స్‌ అదనంగా జతచేశామని వివరించారు.

అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో సామాజికసేవలో భాగంగా పేదలకు కేన్సర్‌కు వైద్యసేవలు అందించి ఆదుకోవాలని సీఓఓ డాక్టర్‌ ప్రభాకర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, అల్ల వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇ.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు..   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)