Breaking News

పెట్టుబడిదారులకు మిల్లింగ్‌లో విస్తృత అవకాశాలు

Published on Thu, 06/29/2023 - 03:17

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్‌ పరిశ్రమలో విస్తృత అవకాశాలున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. ఇందులోభాగంగానే ప్రభుత్వమే సొంతంగా రైస్‌ మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. మంత్రి బుధవారం పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్, ఎస్‌పీపీజెడ్‌ అధికారులు, జపాన్‌ సటాకె కార్పొరేషన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏటా మూడు కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తవుతున్న ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడానికి రాష్ట్రంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

అందుకే రూ.రెండువేల కోట్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మిల్లింగ్‌ పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం మిల్లింగ్‌తోపాటు ఉప ఉత్పత్తులైన రైస్‌ బ్రాన్‌ ఆయిల్, నూక తదితరాలు ప్రాసెసింగ్‌ చేసేందుకు ప్రత్యేక జోన్‌లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం సటాకే, సైలో తదితర ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సటాకె కార్పొరేషన్, ఇతర కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల సాంకేతికతను మంత్రికి వివరించారు, గంటకు 20 నుంచి 1,200 టన్నుల మిల్లింగ్‌ కెపాసిటీ తమ సొంతమని వారు చెప్పారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పి స్తామని గంగుల తెలిపారు. ప్రభుత్వం మిల్లులను ఏర్పాటు చేయడంతోపాటు స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లలో ప్రత్యేకంగా రూ.100కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినవారికి ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.

కాగా, పౌరసరఫరాల శాఖలో ప్రజలకు సేవల్ని మరింత కచ్చితంగా, పారదర్శకంగా అందించేందుకు టెక్నాలజీ సంబంధిత అంశాలపై గంగుల ప్రత్యేకంగా సమీక్షించారు, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు మొదలు బియ్యం పంపిణీ వరకు వివిధ దశల్లో వృధా లేకుండా సాంకేతికతను అప్‌గ్రెడేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, నెట్‌వర్కింగ్, శాటిలైట్‌ టెక్నాలజీలో పనిచేస్తున్న మలోల ఇన్నోవేషన్స్, సీఎస్‌ఎం, ఐబీఐ, ప్లానెట్‌ ఎం తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)