Breaking News

శక్తి.. యుక్తి.. భక్తిల మేలు కలయికే హనుమంతుడు: స్వామి సూర్యపాద

Published on Sun, 06/11/2023 - 09:02

హైదరాబాద్: ధ్యానం, జ్ఞానం ద్వారా మనిషి జీవితంలో ఒత్తిడిని తొలగించి ప్రపంచ శాంతిని తేవటమే గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ లక్ష్యమని స్వామి సూర్యపాద పేర్కొన్నారు. 10వ తేదీ శనివారం సాయంత్రం కర్మన్ ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సత్సంగానికి వందలాది భక్తులు హాజరయ్యారు. 

సాయంత్రం 6.30 గంటలకు ఓంకారం, గణేశస్తుతితో  కార్యక్రమం ప్రారంభమైంది. శక్తి, యుక్తి, భక్తిల కలయికగా హనుమంతుని స్తుతించిన స్వామీజీ, ప్రశాంతత, ధైర్యం, విశ్వాసం సమపాళ్లలో కలిగి ఉండాలనే విషయాన్ని ధ్యానాంజనేయస్వామి నుండి మనం నేర్చుకోవాలని సూచించారు. అనంతరం శ్రీరామ, కృష్ణ, సరస్వతీ దేవతలను, సద్గురువును స్తుతిస్తూ సాగిన స్వామీజీ సుమథుర గానంతో  భక్తులందరూ గొంతు కలిపారు. ప్రతీ భజన అనంతరం కొద్ది సేపు భక్తులందరితో చేయించిన ధ్యానం వారికి అలౌకికానుభూతిని కలిగించింది. 

స్వామి సూర్యపాద గారు పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవుల స్ఫూర్తితో  గత మూడు దశాబ్దాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ, జ్ఞాన, ధ్యాన కార్యక్రమాలను ప్రజలకు నేర్పుతున్నారు. భక్తిపూర్వకమైన హృదయంతో వారు సత్సంగాలలో పాడే భజనలు, వాటికి తోడుగా చేసే ఉపదేశ వాక్యాలు బహుళ జనాదరణ పొందటమే కాక, ప్రజల్లో చక్కని పరివర్తనను కలిగించేందుకు, వారిని మంచి మార్గంలో నడిపించేందుకు దోహదపడుతున్నాయి. 

పూర్వం లక్ష్మీదేవి పల్లెగా పేరొందిన కర్మన్ ఘాట్‌లోని ఆంజనేయస్వామి దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. అప్పటి గోల్కొండ కోటను జయించి చుట్టుపక్కల హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ వస్తున్న అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ పల్లెకు వచ్చి, అక్కడి ధ్యానాంజనేయస్వామి మూర్తిని చూసి నిరుత్తరుడై నిలిచిపోగా, ఈ మూర్తిని దర్శించాలంటే నీ మనసు స్థిరంగా ఉండాలని చెబుతూ ఆలయ పూజారి 'కరో మన్ ఘట్' అని అన్న మాటతో, ఆ ఆలయానికి హాని చేయకుండా ఖిల్జీ మరలిపోయాడని, ఆనాటి నుంచి ఆ ప్రాంతం కరో మన్ ఘట్ లేదా కర్మన్ ఘాట్‌గా పేరు తెచ్చుకుందని చెబుతారు.

ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ధ్యానాంజనేయస్వామి ప్రాంగణంలో జరిగిన ఈ మహా సత్సంగం భక్తుల హృదయాల్లో మధురానుభూతులను మిగిల్చి, ఈ ప్రాంతమంతటికీ సకల శుభాలను కలిగించినదనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అపెక్స్ సభ్యులు రామ్‌కుమార్ రాఠీ, కృష్ణమూర్తి, కో-ఆర్డినేటర్లు శ్రీనివాస్, రోహన్, అనూప్ తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)