Breaking News

రైతులకు ఒకేరోజు రూ.3 వేలకోట్లు

Published on Sat, 06/17/2023 - 03:48

సాక్షి, హైదరాబాద్‌:  యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని.. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము విడుదల ప్రక్రియ దాదాపుగా ముగిసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రూ.3,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని.. ఈ నెల 20వ తేదీలోగా ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు సొమ్ము అందే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈసారి యాసంగిలో ప్రకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి విజయవంతంగా ధాన్యం సేకరణ జరిపామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
65.10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ 
ఈ యాసంగిలో గురువారం నాటికి 11 లక్షల మంది రైతుల నుంచి రూ.13,383 కోట్ల విలువైన 65.10 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి తెలిపారు. ఇందు లో ఓపీఎంఎస్‌లో రూ. 10,439 కోట్ల రసీదులు అప్‌లోడ్‌కాగా.. ఇప్పటి వ రకు రూ.9,168 కోట్లు వి డుదల చేశామన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ముందుగానే అంచనా వేసి.. సాధారణం కంటే పదిరోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ధాన్యం సేకరణ మొదలుపెట్టామని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7,037 కొనుగోలు కేంద్రాలను తెరిచామని.. ఇప్పటికే 90శాతానికి పైగా సేకరణ çపూర్తవడంతో 6,366 కేంద్రాలను మూసేశామన్నారు. 18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ పూర్తయిందని, మిగతా జిల్లాల్లోనూ ఆది వారం నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

ఎక్కడైనా ఆలస్యంగా వరి కో తలు జరిగిన ప్రాంతాల్లో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. కొనుగోళ్లు చేపట్టేందు కు కలెక్టర్లకు అధికారం ఇచ్చామని వివరించారు. గత యాసంగి సీజన్‌ కన్నా ఈసారి ఇప్పటికే 16లక్షల టన్నులు అధికంగా సేకరించామన్నారు. 

కేసీఆర్‌ రైతు అనుకూల విధానాలతోనే.. 
సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలైన రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, అందుబాటులో సాగునీరు, మద్దతు ధరతో కొనుగోళ్లు వంటి కారణాలతో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

కేవలం తొమ్మిదేళ్లలో ధాన్యం సేకరణలో దేశం గరి్వంచే స్థితికి తెలంగాణ చేరుకుందని వివరించారు. ఓవైపు పంటను సేకరిస్తూనే, మరోవైపు అకాల వర్షాల నుంచి కాపాడేందుకు పౌరసరఫరాల యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండి రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)