Breaking News

'విమర్శలకు పోటీ పడుతున్నారు.. కానీ గుజరాత్‌లో ఏం  సాధించారు?'

Published on Fri, 06/02/2023 - 16:33

సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వంపై  బండి సంజయ్, కిషన్ రెడ్డి పోటీ పడి విమర్శలు చేస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడే బీజేపీ.. అధికారంలో ఉన్న గుజరాత్‌లో ఏం  సాధించారో ప్రజలకు తెలపాలన్నారు. అప్పుల గురించి మాట్లాడే నాయకులు అభివృద్ధిని గమనించడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రపంచం మొత్తం మెచ్చుకునే రైతు బీమా, ఉచిత కరెంటు గుజరాత్‌లో ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుచేసి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగించిందని చెప్పారు.

ఆదానీ, అంబానీలకే మేలు..
దేశంలో ఆదానీ, అంబానీలకు ఉపయోగపడే విధంగా బీజేపీ సర్కార్ లక్షల కోట్ల అప్పులు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ఆదానీ, అంబానీ వంటి కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడే విధంగా కేంద్రం మాఫియా ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ఆరోపించారు. ప్రపంచ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం భారతదేశ పరువు తీస్తోందని దుయ్యబట్టారు. రాజకీయ పబ్బం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు. బీజేపీ నిర్వాకం వల్లనే చచ్చిన కాంగ్రెస్ ఉరుకులు పెడుతోందని అన్నారు.

కాంగ్రెస్‌కు చెప్పుకోవడానికి ఏం లేదు కానీ..గత్యంతరం లేకనే  కర్ణాటకలో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ  ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నీడను  ప్రజలు వదలరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

చదవండి: రేవంత్‌రెడ్డిపై బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌


 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)