snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే..
Breaking News
వన్డే ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన జింబాబ్వే.. యువ వికెట్ కీపర్ ఎంట్రీ
Published on Sat, 06/03/2023 - 08:21
వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫైయర్స్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టుకు జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సారధ్యం వహించనున్నాడు. ఈ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ జాయ్‌లార్డ్ గుంబీకి చోటు దక్కింది. ఇది మినహా సెలక్టర్లు తమ జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు.
జట్టులో రజా, సీన్ విలియమ్స్, ముజాబ్‌రానీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లకు జింబాబ్వేనే అతిధ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు భారత వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.
ఇక జింబాబ్వే తమ మొదటి మ్యాచ్‌లో జూన్ 18న హారారే వేదికగా నెపాల్‌తో తలపడనుంది. కాగా ఈ క్వాలిఫియర్స్ రౌండ్‌లో శ్రీలంక, వెస్టిండీస్ వంటి మేటి జట్లు కూడా పాల్గొంటున్నాయి.
జింబాబ్వే జట్టు: ర్యాన్ బర్ల్, టెండై చటారా, క్రెయిగ్ ఎర్విన్, బ్రాడ్లీ ఎవాన్స్, జాయ్‌లార్డ్ గుంబీ, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమణి, వెల్లింగ్‌టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే.. విజేత ఎవరంటే?
Tags : 1