Breaking News

జింబాబ్వే మాజీ కెప్టెన్‌ హీత్ స్ట్రీక్‌ పరిస్థితి విషమం

Published on Sat, 05/13/2023 - 16:13

జింబాబ్వే క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ హీత్‌ స్ట్రీక్‌ పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ మాజీ క్రీడల మంత్రి డేవిడ్ కోల్టార్ట్ సైతం ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. స్ట్రీక్ కోలుకుని, తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు ప్రార్థించాలని ఆయన తన దేశ ప్రజలకు, దేశం వెలుపల ఉన్న ప్రార్ధన యోధులకు పిలుపునిచ్చారు.

జింబాబ్వేకు పాత్రినిధ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరైన  హీత్‌ స్ట్రీక్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, అతనికి మనందరి ప్రార్ధనలు చాలా అవసరమని డేవిడ్ కోల్టార్ట్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. స్ట్రీక్‌ కోసం, అతని కుటుంబం కోసం ప్రార్ధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్ట్రీక్‌ సౌతాఫ్రికాలో ఉన్నట్లు సమాచారం.

కాగా, జింబాబ్వే ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఆల్‌రౌండర్లలో ఒకరైన స్ట్రీక్‌ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్‌ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్‌ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్‌ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)  నిషేధానికి గురయ్యాడు. 

చదవండి: టీమిండియా హెడ్‌ కోచ్‌గా ముజుందార్‌!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)