Breaking News

డోపింగ్‌ టెస్ట్‌లో పట్టుబడ్డ ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్ల సస్పెన్షన్‌

Published on Thu, 12/21/2023 - 19:59

డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించారని రుజువు కావడంతో జింబాబ్వే క్రికెట్‌ బోర్డు (ZC) ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లను సస్పెండ్‌ చేసింది. వెస్లీ మధేవెరె, బ్రాండన్ మవుటా బ్లడ్‌ శాంపిల్స్‌లో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలడంతో ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మధేవెరె, మవుటాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ZC ప్రకటించింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరూ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనరని పేర్కొంది.

26 ఏళ్ల మవుటా ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించగా.. మధేవెరె గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ అయిన మవుటా జింబాబ్వే తరఫున 4 టెస్ట్‌లు, 12 వన్డేలు, 10 టీ20లు ఆడి ఓవరాల్‌గా 26 వికెట్లు పడగొట్టాడు. మవుటా టెస్ట్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీ కూడా చేశాడు.

మధేవెరె విషయానికొస్తే.. 23 ఏళ్ల ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జింబాబ్వే తరఫున 2 టెస్ట్‌లు, 36 వన్డేలు, 60 టీ20లు ఆడి 26 వికెట్లు, 1100 పైగా పరుగులు సాధించాడు. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఇటీవలే ఆ జట్టు హెడ్‌ కోచ్‌ డేవ్‌ హటన్‌  బాధ్యతల నుంచి తప్పుకోగా.. తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా వాల్టర్‌ చాగుటా నియమితుడయ్యాడు.  

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)