టీమిండియాతో టీ20 సిరీస్‌.. జింబాబ్వే క్రికెట్‌ కీలక నిర్ణయం

Published on Thu, 06/20/2024 - 10:52

టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పురుషుల జట్టు హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ జస్టిన్ సామన్స్‌ను జింబాబ్వే క్రికెట్ బోర్డు నియమించింది.

ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2024కి అర్హత సాధించడంలో విఫలం కావడంతో జింబ్వాబ్వే హెడ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి డేవ్ హౌటన్ ఈ ఏడాది ఆరంభంలో తప్పుకున్నాడు. అప్పటి నుంచి జింబ్వాబ్వే ప్రధాన కోచ్‌లేకుండానే పలు టీ20 సిరీస్‌లు ఆడింది.

ఈ నేపథ్యంలోనే తమ జట్టు కొత్త హెడ్‌ కోచ్‌గా  సామన్స్‌ను జింబాబ్వే క్రికెట్‌ ఎంపిక చేసింది. సామన్స్‌తో పాటు ఆ దేశ మాజీ ఆటగాడు డియోన్ ఇబ్రహీమ్‌కు సైతం జింబాబ్వే క్రికెట్‌ కీలక బాధ్యతల అప్పగించింది. జింబాబ్వే అసిస్టెంట్‌ కోచ్‌గా డియోన్ ఇబ్రహీమ్‌ పనిచేయనున్నాడు. 

కాగా సామన్స్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. సామన్స్‌ గతంలో సౌతాఫ్రికా హైఫెర్మెమెన్స్‌ సెంటర్‌లో కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా 2021 నుంచి 2023 వరకు ప్రోటీస్‌ జట్టుకు బ్యాటింగ్‌ సలహాదారుని కూడా పనిచేశాడు.

ఇక స్వదేశంలో భారత్‌తో 5 మ్యాచ్‌ల టీ20సిరీస్‌లో జింబ్వావ్వే తలపడనుంది. ఈ సిరీస్‌ జూలై 6న ప్రారంభమై జూలై 14తో ముగియనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగానే జరగనున్నాయి.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)