జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌ విజేత జోబర్గ్‌ బంగ్లా టైగర్స్‌

Published on Mon, 09/30/2024 - 10:07

జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌ రెండో ఎడిషన్‌ (2024) విజేతగా జోబర్గ్‌ బంగ్లా టైగర్స్‌ అవతరించింది.  నిన్న (సెప్టెంబర్‌ 29) జరిగిన ఫైనల్లో జోబర్గ్‌ బంగ్లా టైగర్స్‌.. కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా టైగర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. మొహమ్మద్‌ షెహజాద్‌ (25 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్‌), కుసాల్‌ పెరీరా (11 బంతుల్లో 33; ఫోర్‌, 4 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సాంప్‌ ఆర్మీ బౌలర్లలో నికోల్సన్‌ గోర్డన్‌ 2, ఖైస్‌ అహ్మద్‌, అమిర్‌ హమ్జా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్‌ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. డేవిడ్‌ మలాన్‌ (28 బంతుల్లో 62 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో విరుచుకుపడినప్పటికీ సాంప్‌ ఆర్మీని గెలిపించలేకపోయాడు. బ్రియాన్‌ బెన్నెట్‌ 36, జాక్‌ టేలర్‌ 23 (నాటౌట్‌) పరుగులు చేయగా.. రోహన్‌ ముస్తఫా డకౌటయ్యాడు. టైగర్స్‌ బౌలర్లలో ఆడమ్‌ మిల్నేకు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన మొహమ్మద్‌ షెహజాద్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

చదవండి: పూరన్‌ సుడిగాలి శతకం

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)