Breaking News

శివాలెత్తిన సికందర్‌ రజా.. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..!

Published on Tue, 07/25/2023 - 13:01

జింబాబ్వే టీ10 లీగ్‌లో ఆ దేశ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా చెలరేగిపోయాడు. హరారే హరికేన్స్‌తో నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్‌లో శివాలెత్తిపోయిన రజా (బులవాయో బ్రేవ్స్‌ కెప్టెన్‌).. లీగ్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (15 బంతుల్లో) కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 21 బంతులను ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. రజాకు కోబ్‌ హెఫ్ట్‌ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో బులవాయో బ్రేవ్స్‌ 135 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఊదేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హరికేన్స్‌.. భారత వెటరన్‌ రాబిన్‌ ఉతప్ప (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విండీస్‌ వీరుడు ఎవిన్‌ లివిస్‌ (19 బంతుల్లో 49; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఫెరియెరా (21 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు), ఇర్ఫాన్‌ పఠాన్‌ (9 బంతుల్లో 18 నాటౌట్‌; 4 ఫోర్లు) చెలరేగిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన సికందర్‌ రజా ఓ వికెట్ పడగొట్టగా.. ప్యాట్రిక్‌ డూలీ 2, తిస్కిన్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్స్‌.. సికందర్‌ రజా, కోబ్‌ హెఫ్ట్‌, వెబ్‌స్టర్‌ (12 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) విజృంభించడంతో 9.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.  బ్రేవ్స్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ మెక్‌డెర్మాట్‌ (8) నిరాశపరచగా.. హరికేన్స్‌ బౌలర్లలో మహ్మద్‌ నబీ, నండ్రే బర్గర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్‌ బాస్‌దే..
టీ10 క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. అబుదాబీ టీ10 లీగ్‌ 2021 సీజన్‌లో బాస్‌ 12 బంతుల్లో 50 కొట్టాడు. అంతకుముందు ఇదే లీగ్‌ 2018 సీజన్‌లో ఆఫ్ఘన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ షెహజాద్‌ కూడా 12 బంతుల్లోనే ఈ ఫీట్‌ సాధించాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)