Breaking News

రెచ్చిపోయిన రాబిన్‌ ఉతప్ప.. సరిపోని ఫ్లెచర్‌ మెరుపులు

Published on Thu, 07/27/2023 - 09:18

జింబాబ్వే టీ10 లీగ్‌లో టీమిండియా వెటరన్‌ ఆటగాడు, హరారే హరికేన్స్‌ ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప తొలి అర్ధశతకం బాదాడు. డర్బన్‌ ఖలందర్స్‌తో నిన్న (జులై 26) జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన ఉతప్ప.. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతనితో పాటు చకబ్వా (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డొనవాన్‌ ఫెరియెరా (12 బంతుల్లో 24 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) రాణించడంతో హరికేన్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఖలందర్స్‌ బౌలర్లలో బ్రాడ్‌ ఈవాన్స్‌, అజ్మతుల్లా తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్‌.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హరికేన్స్‌ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆండ్రీ ఫ్లెచర్‌ (25 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్‌ (28 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఖలందర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. హరికేన్స్‌ బౌలర్‌ లూక్‌ జాంగ్వే 2 వికెట్లు పడగొట్టాడు.

మెరిసిన కాలా.. 
నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీపై బులవాయో బ్రేవ్స్‌.. జోబర్గ్‌ బఫెలోస్‌పై కేప్‌టౌన్‌ విజయాలు సాధించాయి. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రేవ్స్‌.. ఇన్నోసెంట్‌ కాలా (52 నాటౌట్‌), వెబ్‌స్టర్‌ (23 నాటౌట్‌) రాణించడంతో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో గట్టి పోటీ ఇ​చ్చిన కేప్‌టౌన్‌ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో (122/4) నిలిచిపోయింది.

రాణించిన హఫీజ్‌, బొపారా..
కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్‌ హఫీజ్‌ (40 నాటౌట్‌), రవి బొపారా (30 నాటౌట్‌) రాణించడంతో జోబర్గ్‌ బఫెలోస్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేప్‌టౌన్‌.. ముజరబాని (3/7), న్యాయుచి (2/11), డాలా (1/17) ధాటికి 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టాని​కి 89 పరుగులు మాత్రమే చేయగా.. హఫీజ్‌, బొపారా రాణించడంతో బఫెలోస్‌ టీమ్‌ 6.5 ఓవర్లలో కేవలం వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు