Breaking News

రాణించిన ఉతప్ప.. నిరాశపరిచిన పఠాన్‌ సోదరులు

Published on Sun, 07/23/2023 - 14:41

జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్‌ ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరుగురు భారత వెటరన్లు పాల్గొంటుండగా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు.

నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్‌ కెప్టెన్‌ పార్థివ్‌ పటేల్‌ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలం కాగా.. హరారే ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ బ్యాటింగ్‌ (4), బౌలింగ్‌ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లలో హరారే ఆటగాడు రాబిన్‌ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు.

కేప్‌ హరారే హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టౌన్‌ సాంప్‌ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్‌ (25) ఓ మోస్తరు స్కోర్‌ చేయడంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 స్కోర్‌ చేయగా.. హరారే హరికేన్స్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 97/6 స్కోర్‌ చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

డర్బన్‌ ఖలందర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జోబర్గ్‌ బఫెలోస్‌ ఆటగాడు, భారత మాజీ ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ సైతం తేలిపోయాడు. అతను 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జోబర్గ్‌ బఫెలోస్‌.. టామ్‌ బాంటన్‌ (55 నాటౌట్‌) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేయగా.. డర్బన్‌ ఖలందర్స్‌మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హజ్రతుల్లా జజాయ్‌ (41 నాటౌట్‌) డర్బన్‌ను గెలిపించాడు.

నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో  కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రేవ్స్‌.. బెన్‌ మెక్‌డెర్మాట్‌ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేయగా.. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్‌ ఆర్మీని గెలిపించాడు. 

కాగా, జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత ఆటగాళ్లు పార్థివ్‌ పటేల్‌, స్టువర్ట్‌ బిన్నీ (కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ), రాబిన్‌ ఉతప్ప, ఇర్ఫాన్‌ పఠాన్‌, శ్రీశాంత్‌ (హరారే హరికేన్స్‌), యూసఫ్‌ పఠాన్‌ (జోబర్గ్‌ బఫెలోస్‌) పాల్గొంటున్న విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)