Breaking News

సరిపోని టిమ్‌ సీఫర్ట్‌ మెరుపులు.. ఇర్ఫాన్‌ పఠాన్‌ ఊచకోత

Published on Sun, 07/23/2023 - 20:37

జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌లో డర్బన్‌ ఖలందర్స్‌కు ఆడుతున్న న్యూజిలాండ్‌ ప్లేయర్‌ టిమ్‌ సీఫర్ట్‌ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్‌కు నిక్‌ వెల్చ్‌ (9 బంతుల్లో 22 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) తోడవ్వడంతో డర్బన్‌ ఖలందర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఖలందర్స్‌ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్‌ (3), ఆండ్రీ ఫ్లెచర్‌ (2) విఫలం కాగా.. ఆసిఫ్‌ అలీ (18; 2 సిక్సర్లు) కాసేపు అలరించాడు. హరారే బౌలర్లలో మహ్మద్‌ నబీ 2 వికెట్లు పడగొట్టగా.. సమిత్‌ పటేల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరారే హరికేన్స్‌.. కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవక ఖలందర్స్‌కు ధీటైన సమాధానం ఇ‍చ్చింది. ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ రెగిస్‌ చకబ్వా (22 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. వీరికి డొనవన్‌ ఫెరియెరా (16; 2 సిక్సర్లు), మహ్మద్‌ నబీ (19; 2 ఫోర్లు, సిక్స్‌) సహకరించారు. హరారే ఇన్నింగ్స్‌లో రాబిన్‌ ఉతప్ప (1), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (2) విఫలమయ్యారు. ఖలందర్స్‌ బౌలర్లలో మహ్మద్‌ అమీర్‌ 2, బ్రాడ్‌ ఈవాన్స్‌, జార్జ్‌ లిండే, టెండాయ్‌ చటారా తలో వికెట్ పడగొట్టారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)