Breaking News

రెండేళ్ల తర్వాత...

Published on Mon, 10/12/2026 - 04:26

బీజింగ్‌: సొంతగడ్డపై చైనా టెన్నిస్‌ స్టార్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ సంచలనం సృష్టించింది. మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) చైనా ఓపెన్‌–1000 సిరీస్‌ టైటిల్‌ను కిన్‌వెన్‌ జెంగ్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రెండేళ్ల టైటిల్‌ నిరీక్షణకు ఆమె తెరదించింది. చివరిసారి 2024 అక్టోబరులో కిన్‌వెన్‌ టోక్యోలో పాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించింది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్‌  టోర్నీ సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 54వ ర్యాంకర్‌ కిన్‌వెన్‌ 7–5, 6–4తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియిన్‌ మిరా ఆండ్రీవా (రష్యా)పై విజయం సాధించింది. 

తద్వారా ఈ టోర్నీలో టైటిల్‌ గెలిచిన తొలి చైనా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ‘వైల్డ్‌ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగి టైటిల్‌ గెలిచిన తొలి ప్లేయర్‌గానూ పారిస్‌ ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత అయిన కిన్‌వెన్‌ రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా కిన్‌వెన్‌కిది ఆరో సింగిల్స్‌ టైటిల్‌కాగా... 1000 లెవెల్‌లో తొలి టైటిల్‌. విజేత హోదాలో కిన్‌వెన్‌కు 11,51,380 డాలర్ల (రూ. 11 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)