Breaking News

సంచలనం.. సూపర్ ఓవర్‌లో జీరో రన్స్‌! 16 ఏళ్ల చరిత్రలోనే?

Published on Sat, 03/15/2025 - 19:04

మ‌లేషియా- హాంకాంగ్‌-బ‌హ్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న టైసిరీస్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం బ్యూమాస్ క్రికెట్ ఓవల్ వేదిక‌గా హాంకాంగ్‌, బ‌హ్రెయిన్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో బ‌హ్రెయిన్ అత్యంత చెత్త రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది. సూప‌ర్ ఓవ‌ర్‌లో ఒక్క ప‌రుగు కూడా సాధించ‌ని జ‌ట్టుగా బహ్రెయిన్ చెత్త రికార్డును నెల‌కొల్పింది. 16 ఏళ్ల సూప‌ర్ ఓవ‌ర్ చరిత్రలో ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేయలేదు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.  హాంకాంగ్ బ్యాటర్లలో జీషన్ అలీ (29), షాహిద్ వాసిఫ్ (31), నస్రుల్లా రాణా (14) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఓపెనర్ ప్రశాంత్ కురుప్ (37 బంతుల్లో 31) బహ్రెయిన్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

అయితే ఆ తర్వాత బహ్రెయిన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో బహ్రెయిన్ విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఆ జట్టు కెప్టెన్‌ అహ్మర్ బిన్ నాసిర్,  మొదటి రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేశాడు.

తర్వాతి రెండు బంతుల్లో రెండు సింగిల్స్‌​ వచ్చాయి. దీంతో బహ్రెయిన్ విజయసమీకరణం చివరి రెండు బంతుల్లో ఏడు పరుగులుగా మారింది. ఐదో బంతికి అహ్మర్ బిన్ సిక్సర్‌గా మలచి మ్యాచ్‌ను టై చేశాడు. అయితే ఆఖరి బంతికి బిన్ ఔట్ కావడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్‌లు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు.

ఎహ్సాన్ అదుర్స్‌..
ఈ క్ర‌మంలో సూప‌ర్ ఓవ‌ర్‌లో ఛేజింగ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బహ్రెయిన్ కెప్టెన్ బిన్‌,  సోహైల్ అహ్మద్ లు సూప‌ర్ ఓవ‌ర్‌ను ఎదుర్కోనేందుకు వ‌చ్చారు. అదేవిధంగా ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు కెప్టెన్ ఈ సూప‌ర్ ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను స్పిన్న‌ర్ ఎహ్సాన్ ఖాన్‌కు అప్ప‌గించాడు.

ఈ క్ర‌మంలో ఎహ్సాన్ రెండవ బంతికి బిన్ ను, మూడవ బంతికి సోహైల్ అహ్మద్‌ను ఔట్ చేయ‌డంతో ప‌రుగులు ఏమి రాకుండా సూప‌ర్ ఓవ‌ర్ ముగిసింది. దీంతో బహ్రెయిన్ ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా బ్యాటింగ్‌కు దిగిన జ‌ట్టు రెండు వికెట్లు కోల్పోతే సూప‌ర్ ఓవ‌ర్ ముగుస్తుంది.
చదవండి: IPL 2025: 'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ స‌డన్‌గా ఏమైందో మరి'
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)