Breaking News

బంగ్లాదేశ్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు.. 10 ఏళ్ల తర్వాత

Published on Fri, 08/18/2023 - 10:13

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు 10 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా కివీస్‌ మూడు వన్డేలు, రెండు టెస్టులు అతిథ్య బంగ్లాదేశ్‌తో ఆడనుంది. కివీస్‌ రెండు దఫాలుగా బంగ్లాదేశ్‌ టూర్‌కు వెళ్లనుంది. తొలి దశ పర్యటనలో మూడు వన్డేలు న్యూజిలాండ్‌ ఆడనుంది. అనంతరం రెండో దశలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాతో న్యూజిలాండ్‌ తలపడనుంది.

ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారింగా దృవీకరించింది. సెప్టెంబర్‌ 21న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. అనంతరం నవంబర్‌ 28 నుంచి టెస్టు సిరీస్‌ మొదలు కానుంది. కాగా వన్డే ప్రపంచకప్‌ సన్నహకాల్లో భాగంగా ఈ సిరీస్‌ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం ఇరు జట్లు ప్రపంచకప్‌ కోసం భారత్‌కు రానున్నాయి.

ఇక చివరిగా 2013లో కివీస్‌ బంగ్లా పర్యటనకు వెళ్లింది. అప్పుడు రెండు టెస్టుల సిరీస్‌ డ్రా కాగా.. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా 3-0తో కివీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. ఏకైక టీ20లో మాత్రం న్యూజిలాండ్‌ విజయం సాధించింది. కాగా న్యూజిలాండ్‌ జట్టు ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో అతిథ్య యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో కివీస్‌ తలపడుతోంది. ఇప్పటికే దుబాయ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌ ఘన విజయం సాధించింది.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు! నా టార్గెట్‌ అదే: బుమ్రా

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)