అండర్సన్ కంటే జహీర్‌ ఖాన్‌ బెస్ట్‌ బౌలర్‌: ఇషాంత్‌

Published on Mon, 06/26/2023 - 11:41

భారత క్రికెట్‌లో మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్ ఖాన్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్‌ దాదాపు దశాబ్దం పాటు భారత క్రికెట్‌కు తన సేవలు అందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 21 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాక్... అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు తీసుకున్నాడు.

అయితే మరోసారి ఈ దిగ్గజ పేసర్‌పై టీమిండియా వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా రణ్‌వీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్ అండర్సన్, జహీర్‌ ఖాన్‌లో ఎవరు అత్యుత్తమ బౌలర్‌ అని రణ్‌వీర్ ప్రశ్నించాడు.

అందుకు బదులుగా ఇషాంత్‌ ఏమీ ఆలోచింకుండా అండర్సన్ కంటే జహీర్‌ గొప్ప బౌలర్‌ను అని చెప్పుకొచ్చాడు. కాగా అండర్సన్‌ కూడా ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 180 టెస్టులు, 194 వన్డేలు ఆడిన అండర్సన్‌ వరుసగా 269, 686 వికెట్లు పడగొట్టాడు. అతడి టెస్టు కెరీర్‌లో ఏకంగా 32 ఫైవ్‌ వికెట్ల హాల్స్‌ ఉన్నాయి.

"జిమ్మీ అండర్సన్ బౌలింగ్ శైలి కాస్త బిన్నంగా ఉంటుంది. అతడు టాప్‌ క్లాస్‌ బౌలర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు ఎక్కువ భాగం తన కెరీర్‌లో ఇంగ్లండ్‌లోనే ఆడాడు. ఇంగ్లండ్‌ పిచ్‌లకు పేసర్లు అనుకూలిస్తాయి, అదే భారత్‌లో ఆడి వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. నా వరకు అయితే అండర్సన్‌ కం‍టే జాక్‌(జహీర్‌ ఖాన్‌) బెస్ట్‌ బౌలర్‌" అని ఇషాంత్‌ పేర్కొన్నాడు. 
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌ టూర్‌కు ముందు చాహల్‌ కీలక నిర్ణయం.. మరో లీగ్‌లో ఆడేందుకు!

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)