Breaking News

క్రికెట్ జట్టు యజమానిగా జహీర్ ఖాన్

Published on Wed, 08/05/2026 - 11:22

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ వ్యాపార రంగంలో మరో కీలక అడుగు వేశాడు. లంక ప్రీమియర్ లీగ్ (LPL) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన 'జాఫ్నా కింగ్స్' జట్టు సహ యజమానిగా జహీర్ మారాడు. కాగా జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది.

మొన్నటి వరకు ఈ ఫ్రాంచైజీ ఓనర్‌గా 'స్పోర్ట్స్ కమ్యూన్' సంస్థ ఉండేది. ఇందులో వాటాను భారత మాజీ అండర్‌-19 క్రికెటర్ మంజోత్ కాల్రా కొనుగోలు చేసి కో-ఓన‌ర్‌గా మారాడు. అయితే ఎల్‌పీఎల్-2026 ప్రారంభ‌మైన కొద్ది రోజుల‌కే మంజోత్ కాల్రాను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక స్పోర్ట్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అరెస్ట్ చేసింది. అదేవిధంగా స్పోర్ట్స్ కమ్యూన్ సంస్థ కూడా ఆర్థికంగా దివాలా తీసింది.

ఆటగాళ్లకు వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. ఈ వివాదాల నేపథ్యంలో పాత యాజమాన్యాన్ని తొలగించి, కొత్త వారికి ఫ్రాంచైజీ హ‌క్కుల‌ను క‌ట్టబెట్టాల‌ని లంక క్రికెట్ బోర్డు నిర్ణ‌యించింది. ఈ క్రమంలోనే జాఫ్నా జట్టును యాంకర్ స్పోర్ట్స్‌ సొంతం చేసుకుంది. అందులో వాటాను జహీర్ ఖాన్ కొనుగోలు చేశాడు.

ఇకపై ఈ జ‌ట్టును యాంకర్ జాఫ్నా కింగ్స్ అని పిలవ‌నున్నారు.  కాగా యాంకర్ స్పోర్ట్స్ సంస్థకు ఇప్పటికే యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్‌లో 'యాంట్వెర్ప్ యాంకర్స్', కెనడా సూపర్స్ 60 లీగ్‌లో వాంకోవర్ యాంకర్స్ జట్లు ఉన్నాయి. యాంట్వెర్ప్ యాంకర్స్ ఫ్రాంచైజీలో కూడా జ‌హీర్ ఖాన్ భాగ‌స్వామిగా ఉన్నాడు.
చదవండి: సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లో 241 రన్స్‌

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)