Breaking News

నువ్వంటే నాకిష్టం.. నా లవ్‌ నువ్వే: బట్లర్‌కు చాహల్‌ ప్రపోజల్‌.. వైరల్‌

Published on Fri, 04/21/2023 - 09:43

టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ మైదానంలోనే కాకుండా ఆఫ్‌ది ఫీల్డ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో తన అభిమానులను చాహల్‌ అలరిస్తుంటాడు. అయితే తాజాగా చాహల్‌కు సంబంధించిన మరో వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

చాహల్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2023లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌కు.. చహల్‌ ఫన్నీగా డేటింగ్‌ ప్రపోజ్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఈ టీమిండియా చేతిలో ఒక చిన్న పూల కుండీని పట్టుకుని మరీప్రపోజ్‌ చేశాడు. "జోస్ భాయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా జీవితం. గతేడాది తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. ప్రతిరోజు నాకు గుర్తొస్తూనే ఉంటావు. ప్లీజ్‌ నాతో డేట్‌కు వస్తారా" అని సరదాగా చహల్‌ ప్రపోజ్‌ చేశాడు.

అందుకు బదులుగా బట్లర్‌ "సరే యుజీ.. నేను కచ్చితంగా వస్తాను" అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కన వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక రాజస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 20న ఆర్సీబీతో తలపడనుంది.

చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్‌
                  IPL 2023: విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)