IPL 2025 Qualifier 2: పంజాబ్‌కు గుడ్‌ న్యూస్‌.. ముంబైకి బ్యాడ్‌ న్యూస్‌?

Published on Sun, 06/01/2025 - 09:08

ఐపీఎల్‌-2025లో క్వాలిఫ‌య‌ర్‌-2కు స‌మ‌యం అస‌న్న‌మైంది. ఆదివారం సెకెండ్ క్వాలిఫ‌య‌ర్‌లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ కీల‌క మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయం కార‌ణంగా గ‌త కొన్ని మ్యాచ్‌ల‌కు దూర‌మైన యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో క్వాలిఫ‌య‌ర్‌-2కు చాహ‌ల్ అందుబాటులో ఉండ‌నున్నాడ‌ని రేవ్‌స్పోర్ట్స్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. 

కాగా చాహ‌ల్ గాయం నుంచి కోలుకుపోవ‌డం పంజాబ్‌కు క‌లిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో చాహల్ పంజాబ్‌ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అత‌డి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడిన చాహ‌ల్‌.. 9.56 ఏకానమితో 14 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

చాహ‌ర్ డౌటే..
మ‌రోవైపు ఈ మ్యాచ్‌కు కూడా ముంబై ఇండియ‌న్స్ స్టార్ పేస‌ర్ దీప‌క్ చాహ‌ర్ అందుబాటులో ఉండేది అనుమాన‌మే. తొడ కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్న చాహ‌ర్‌.. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించన‌ట్లు తెలుస్తోంది. ఈ రైట్ ఆర్మ్ పేస‌ర్ కోచింగ్ స్టాప్‌,  కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి ఫిట్‌నెస్ కసరత్తులు చేస్తున్న‌ట్లు రేవ్‌స్పోర్ట్స్ త‌మ క‌థ‌నంలో రాసుకొచ్చింది. కానీ అత‌డు ఇంకా కుంటుతున్న‌ట్లు స‌ద‌రు వెబ్‌సైట్ రాసుకొచ్చింది. ఒక‌వేళ ఈ మ్యాచ్‌కు చాహ‌ర్ దూర‌మైతే.. యువ పేస‌ర్ అశ్వినీ కుమార్‌కు మరోసారి అవకాశం లభించనుంది.

తుది జట్లు(అంచనా)
పంజాబ్ కింగ్స్‌
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీప‌ర్‌), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్, చాహ‌ల్‌

ముంబై ఇండియ‌న్స్‌
రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)