Breaking News

కౌన్సెలింగ్ ఇచ్చినా మారని చాహల్‌, ధనశ్రీ..

Published on Fri, 02/21/2025 - 16:37

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal), అతడి భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా వీరిద్ద‌రూ విడిపోతున్నారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్ద‌రికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

విడాకులకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తి అయిన‌ట్లు వినిక‌డి. గురువారం బాంద్రా కోర్టు బ‌య‌ట చాహ‌ల్ కన్పించ‌డం ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తోంది. ఏబీపీ న్యూస్ రిపోర్టు ప్రకారం.. గురువారం ఉద‌యం చాహ‌ల్‌- ధ‌న‌శ్రీ విడాకుల కేసు విచారణకు వచ్చింది. 

ఆ త‌ర్వాత న్యాయమూర్తి ఈ జోడీకి కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు. దాదాపు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ జ‌రిగింది. కౌన్సెలింగ్ సెషన్ తర్వాత ఇద్ద‌రూ ప‌రస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్నారని న్యాయమూర్తికి తెలియ‌జేశారు. దీంతో సాయంత్రం 4.30 గంటలకు వీళ్లకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే తుది విచారణకు ముందు చాహల్‌​ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు

"దేవుడు నన్ను నేను లెక్కించగలిగే దానికంటే ఎక్కువ సార్లు రక్షించాడు. ఆ సందర్బాలు కూడా నాకు గుర్తులేవు. నేను కష్టాల్లో ప్రతీ సమయంలోనూ దేవుడు నన్ను కాపాడాడు. ఎప్పుడూ నాకు రక్షణగా ఉన్న దేవుడుకి కృతజ్ఞతలు’ అని చాహల్ రాసుకొచ్చాడు.

"మనం పడే బాధలు, ఎదుర్కొనే సవాళ్లు, ఒత్తడిని కొంతకాలం అనంతరం ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. మీరు ఈ రోజు ఏదైనా విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయం తెలుసుకోండి. బాధలను మర్చిపోయి దేవుడిని ప్రార్థించండి.

దేవుడిపై మీకున్న విశ్వాసం మీకు మంచి జరిగేలా చేస్తుంది అంటూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ను షేర్‌ చేసింది. కాగా 2020లో కొవిడ్ లాక్ డౌన్ సమయంలో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీతో వర్మతో చాహల్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో డిసెంబర్ 2020లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
చదవండి: IPL 2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్‌..
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)