Breaking News

సూర్య అద్భుతమైన ఆటగాడు.. ప్రపంచకప్‌లో దుమ్ము రేపుతాడు: యువరాజ్‌

Published on Fri, 03/24/2023 - 21:35

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్‌లో మూడింట్లోనూ గోల్డెన్ డకౌట్‌గా సూర్య వెనుదిరగాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్‌ అత్యంత చెత్త రికార్డును కూడా నెలకొల్పాడు.

ఇక ఫామ్‌​ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సూర్యకుమార్‌కు భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ​మద్దతుగా నిలిచాడు. టీమిండియాకు సూర్యకుమార్‌ కీలక ఆటగాడని, వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తాడని యువరాజ్ అభిప్రాయపడ్డాడు.

"ప్రతీ క్రీడాకారుడు కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజం. ఏదో ఒక సమయంలో మనమందరం అనుభవించే ఉంటాం. భారత జట్టుకు సూర్య చాలా కీలకమైన ఆటగాడని నేను భావిస్తున్నాను. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడు తన ఫామ్‌ను తిరిగి కచ్చితంగా పొందుతాడు. అదేవిధంగా రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో కూడా సూర్య అదరగొడతాడని నేను ఆశిస్తున్నాను. సూర్య మళ్లీ కచ్చితంగా మెరుస్తాడు" అని యువరాజ్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: పంత్‌ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)