Breaking News

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యూకీ జోడీ

Published on Thu, 10/30/2025 - 04:03

పారిస్‌: భారత పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌ నంబర్‌వన్‌ యూకీ బాంబ్రీ... పారిస్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 సిరీస్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌)–ఆడమ్‌ పావ్లాసెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) ద్వయం 7–6 (7/5), 7–6 (7/3)తో ఆండ్రీ గొరాన్సన్‌ (స్వీడన్‌)–జాన్‌ జిలిన్‌స్కీ (పోలాండ్‌) జంటపై గెలుపొందింది. 1 గంట 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–పావ్లాసెక్‌ రెండు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. 

తొలి సర్వీస్‌లో 49 పాయింట్లకుగాను 34 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 25 పాయింట్లకుగాను 13 పాయింట్లు సాధించారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశారు. మరోవైపు భారత్‌కే చెందిన సీనియర్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నకు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో బోపన్న (భారత్‌)–అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌) ద్వయం 5–7, 2–6, 8–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో జాన్‌ పీర్స్‌ (ఆ్రస్టేలియా)–జేజే ట్రేసీ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 

70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–బుబ్లిక్‌ నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశారు. అయితే సూపర్‌ టైబ్రేక్‌ కీలకదశలో బోపన్న ద్వయం పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. తొలి రౌండ్‌లో ఓడిన బోపన్న–బుబ్లిక్‌లకు 14,350 యూరోలు (రూ. 14 లక్షల 76 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)