Breaking News

యూకీ బాంబ్రీ తొలిసారి ఏటీపీ మాస్టర్స్‌ సెమీస్‌లోకి...

Published on Fri, 03/13/2026 - 01:40

ఇండియన్‌వెల్స్‌ (అమెరికా): భారత డబుల్స్‌ టెన్నిస్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ తొలిసారి ఏటీపీ మాస్టర్స్‌–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. స్వీడెన్‌ ప్లేయర్‌ గొరన్సన్‌తో జోడీ కట్టిన భారత ఆటగాడు క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రత్యర్థి జంటపై గెలుపొందింది. గురువారం ఇక్కడ జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌–స్వీడెన్‌ ద్వయం 6–3, 7–6తో అలెగ్జాండర్‌ ఎర్లెర్‌ (ఆ్రస్టేలియా)–అండ్రియా వవసొరి (ఇటలీ) జంటపై విజయం సాధించింది. సరిగ్గా గంటన్నర పాటు జరిగిన ఈ పోరులో యూకీ జోడీ అద్భుతంగా రాణించింది. 

రెండో సెట్‌లో ఆసీస్‌–ఇటాలీయన్‌ జంట పుంజుకోవడంతో పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. కీలకమైన సమయంలో వరుసగా పాయింట్లు సాధించడంతో టైబ్రేక్‌కు దారితీయకుండా మ్యాచ్‌లో విజయం సాధించారు. గతంలో ఏటీపీ మాస్టర్స్‌–1000 టోర్నీలో క్వార్టర్స్‌ దశలోనే యూకీ వెనుదిరిగాడు. రెండు సార్లు క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకున్న యూకీ ఇప్పుడు స్వీడెన్‌ ఆటగాడితో కలిసి సెమీస్‌ చేరాడు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)