Breaking News

శీతల్ దేవికి వైఎస్‌ జగన్‌ అభినందనలు

Published on Sat, 11/08/2025 - 18:42

ఆసియాక‌ప్ టోర్నీ కోసం భార‌త జ‌ట్టుకు ఎంపికైన భార‌త పారా అర్చ‌ర్ శీత‌ల్ దేవికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు. 

"శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఓపెన్‌ ఆర్చరీ (ఏబుల్డ్‌) ఈవెంట్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్‌గా నిలిచిన శీతల్‌కు అభినందనలు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చని శీతల్ నిరూపించింది. ఆసియాకప్‌లో పాల్గోనున్న ఆమెకు ఆల్‌ది బెస్ట్" అంటూ ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు.


 చరిత్ర సృష్టించిన శీతల్‌..
శీతల్ దేవికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. కాళ్లతో విల్లును పట్టుకుని టార్గెట్‌ను గురిపెడుతూ పారా ఆర్చరీ ప్రపంచంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 

2024 పారాలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన శీతల్‌... భారత జూనియర్‌ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్‌ స్టేజ్‌–3 టోర్నీలో వైకల్యం లేని, సాధారణ ఆర్చర్లతో కలిసి ఆమె పోటీపడనుంది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి