Breaking News

కోనేరు హంపికి అభినందనలు తెలిపిన వైఎస్ జగన్

Published on Thu, 04/24/2025 - 13:44

భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్‌ప్రి టైటిల్‌ గెలిచిన హంపీ.. తన విజయంతో దేశం గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఆమె సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

నల్ల పావులతో ఎక్కువ గేమ్‌లు ఆడి
కాగా అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ ఐదో అంచె టోర్నమెంట్‌లో.. ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి కోనేరు హంపి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పుణె వేదికగా బుధవారం ముగిసిన ఈ టోర్నీలో  హంపి, చైనా గ్రాండ్‌మాస్టర్‌ జు జినెర్‌తో కలిసి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.

అయితే, ఈ టోర్నమెంట్లో నల్ల పావులతో ఎక్కువ గేమ్‌లు (5) ఆడినందుకు హంపికి టైటిల్‌ ఖరారైంది. మరోవైపు.. నల్ల పావులతో తక్కువ గేమ్‌లు (4) ఆడిన జు జినెర్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. పది మంది మేటి చెస్‌ క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)