Breaking News

పీవీ సింధుకు వైఎస్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

Published on Sun, 07/19/2026 - 11:47

జ‌పాన్ ఓపెన్ టోర్నీలో విజేత‌గా నిలిచిన భార‌త ష‌ట్ల‌ర్‌, తెలుగుతేజం పీవీ సింధుకు వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి 'ఎక్స్‌' వేదిక‌గా అభినంద‌న‌లు తెలిపారు. జ‌గ‌న్ స్పందిస్తూ.. 'జ‌పాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భార‌త మ‌హిళా ష‌ట్ల‌ర్‌గా రికార్డుల‌కెక్కి, త‌న కెరీర్‌లో మ‌రో కిరీటాన్ని చేర్చుకున్న సింధుకు అభినంద‌న‌లు. మీ ప్ర‌ద‌ర్శ‌న భార‌తదేశానికి గ‌ర్వ‌కారణం. భ‌విష్య‌త్తులో సింధు మ‌రిన్ని అద్భుత విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా' అని ట్వీట్ చేశారు.

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 టోర్నీ విజేతగా పీవీ సింధు నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు 21-17, 21-17తో అకానె యమగూచిపై  రెండు వరుస గేముల్లో విజయం సాధించింది. కాగా సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కాగా భార‌త్ త‌ర‌ఫున జ‌పాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డుల‌కెక్కింది. కొంత‌కాలంగా స‌రైన ఫామ్‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న సింధు 19 నెల‌ల త‌ర్వాత ఒక మేజ‌ర్ టోర్నీ టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)