Breaking News

'నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు.. ధోనిని ఎప్పటికీ క్షమించను'

Published on Mon, 09/02/2024 - 09:18

ఎంస్ ధోని.. భార‌త క్రికెట్ రూప‌రేఖ‌ల‌ను మార్చేసిన నాయ‌కుడు. భార‌త జ‌ట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఏకైక కెప్టెన్‌. త‌న అద్బుత కెప్టెన్సీతో, ఆట‌తీరుతో టీమిండియాను నెం1 జ‌ట్టుగా నిలిపిన ఘ‌న‌త మిస్ట‌ర్ కూల్‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను ఎంఎస్‌డి సొంతం చేసుకున్నాడు. రిటైర్మెంట్ ప్ర‌క‌టించి దాదాపు నాలుగేళ్లు అవుతున్న‌ప్ప‌ట‌కి అత‌డిపై అభిమానం ఇసుమంత కూడా త‌గ్గ‌లేదు. 

కేవ‌లం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ధోనిని మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ ప్రతీ ఏటా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అంతలా ఆరాధించే ధోనిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి విమర్శల వర్షం కురిపించాడు. ధోని వల్లే యువరాజ్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిందని యోగరాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఎప్పటికీ క్షమించను..
యువరాజ్ సింగ్ కెరీర్‌ను ఎంఎస్ ధోని నాశనం చేశాడు. అతడిని నేను ఎప్పటకి క్షమించను. తనను తను అద్దంలో చూసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ధోని చాలా పెద్ద క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు నా కొడుకు పట్ల పక్షపాతంగా వ్యవహరించాడు.

ప్రతీ విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. నేను ఎవరైనా తప్పు చేశారని భావిస్తే వారిని జీవితంలో క్షమించను. అది నా కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. యువరాజ్ ఇంకా నాలుగైదేళ్లు ఈజీగా ఆడేవాడు. కానీ ధోని మాత్రం నా కుమారుడికి సపోర్ట్ చేయలేదు.

అందుకే తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. క్యాన్సర్‌తో బాధపడుతూనే దేశం కోసం ఆడి.. ప్రపంచకప్‌ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్‌ను భారతరత్నతో సత్కరించాలని జీస్వీచ్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.

యువీది చెరగని ముద్ర..
కాగా యువరాజ్ కూడా భారత క్రికెట్‌లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు.  2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ సొంతం చేసుకోవడం యువీ కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరపున 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌.. 11,178 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 17 సెంచరీలు,71 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)